ప్రధాని మోడీతో రామ్ చరణ్ భేటీ
ప్రముఖ సినీ నటుడు నాటు నాటు పాటతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన రామ్ చరణ్ శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకుంటున్నారు. నేరుగా ఆస్కార్ వేదిక నుంచి హస్తినకు చేరుకోనున్న ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్ లో పాల్గొంటారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నట్లు తెలిసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత అమెరికా నుంచి తొలిసారిగా భారత్ చేరుకుంటున్న రామ్ చరణ్ కు ఘన స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు అభిమానులు ఏర్పాట్లు చేశారు.

