‘జైజగన్నాథ్’ నినాదంతో హోరెత్తిన పూరీ- వైభవంగా రథయాత్ర
ప్రపంచ ప్రసిద్ధమైన పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభమయ్యింది. జైజగన్నాథ్ అంటూ పూరీ పట్టణమంతా బారులు తీరారు భక్తులు. ఒడిశాప్రజలు మాత్రమే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తి వచ్చారు. నగర వీధులన్నీ క్రిక్కిరిసి పోయాయి. ఈ రోజు ఉదయం శ్రీ జగన్నాథ, బలరామ, సుభద్ర, సుదర్శన విగ్రహాలను రథాలపై ప్రతిష్టించారు. అనంతరం మంగళహారతులర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పూరీ నగర రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహర ప్రక్రియను చేస్తారు. అంటే బంగారు చీపురుతో రథాలపై ఊడుస్తారు. అనంతరం 3 గంటలకు రథాలను లాగుతూ సాయంత్రానికి గుండిచా మందిరానికి చేరుకుంటారు.

ఈ రథయాత్రను పునస్కరించుకుని సుదర్శన్ పట్నాయక్ అనే కళాకారుడు 250 కొబ్బరికాయలతో పూరీ బీచ్‌లో ఇసుక, కొబ్బరికాయలతో అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

