Home Page SliderNational

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు అనారోగ్యం

మాజీ నటి రేణు దేశాయ్ తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో షాకింగ్ అప్‌డేట్‌ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో గుండె, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, దానిని ఎదుర్కోవడం కష్టంగా ఉందంది. “నేను కొన్ని సంవత్సరాల నుండి గుండె, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నా… నా దగ్గర, ప్రియమైన వారందరికీ తెలుసు… కొన్నిసార్లు వాటన్నింటిని అర్థం చేసుకోవడం కష్టమవుతుంది” అని రేణు దేశాయ్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అయితే అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు పోరాడతానని ‘బద్రి’ నటి ధీమా ఉందంది. “కానీ ఈరోజు నేను దీన్ని ఇక్కడ పోస్ట్ చేయడానికి కారణం, ఇలాంటి సమస్యలతో పోరాడుతున్న అనేక మందిని గుర్తుచేసుకోవడం కోసమే, ఆరోగ్యం ఎలా ఉన్నా… బలంగా ఉండాలని, విశ్వాసం ఉంచాలని, జీవితంపై ఆశను కోల్పోకూడదు.”అంటూ రెండో పేరాలో అభిప్రాయుపడింది. చికిత్స, మందులు, యోగా, పోషకాహారం, తీసుకుంటున్నానని… త్వరలో సాధారణ జీవితానికి తిరిగి రావాలని ఆశిస్తున్నానంది. రేణు పోస్ట్‌తో ఒక్కసారిగా ఆమె ఫాలోవర్లను దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు సందేశాలు రాసుకొస్తున్నారు. 18 సంవత్సరాల తర్వాత, రేణు దేశాయ్ తన మొదటి చిత్రానికి సంతకం చేసింది. మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు.’ అయితే ఇది చాలా కాలం నుంచి అప్‌డేట్ లేకుండా పోయింది.