కాఫీ గింజల సేకరణ స్టార్ట్..
అనంతగిరి: అనంతగిరి మండలంలో కాఫీ తోటల్లో పండ్ల సేకరణను రైతులు ప్రారంభించారు. సాధారణంగా నవంబర్ నెల చివరి నుండి పండ్ల సేకరణ ప్రారంభమవుతుంది. ప్రస్తుత విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సేకరణను ముందుగానే ప్రారంభించినట్లు రైతులు చెబుతున్నారు. రాజ్‌పాక, అనంతగిరి, బీసుపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో అధికంగా కాఫీ తోటలు ఉన్నాయి. గత ఏడాది కేజీ రూ.100 నుంచి రూ.150 చెల్లించి కొనుగోలు చేశారని, ఈ ఏడాది కేజీకి రూ.300 వరకు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ధర తక్కువిస్తే ఆర్థికంగా నష్టపోతున్నామని చెబుతున్నారు.