వీడియోకాల్ ద్వారా ఆపరేషన్..కవలపిల్లల మృతి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. అక్కడ ఒక వీడియోకాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని దానివల్ల కవలపిల్లలు మృతి చెందారని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు నిర్లక్ష్యంగా గర్భవతికి సిజేరియన్ చేశారని, దీనివల్ల మృత కవల శిశువులు జన్మించారని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

