మరోసారి తెలుగు వర్సెస్ తమిళ్ మూవీల విడుదలపై రచ్చ
డబ్బింగ్ సినిమా వివాదం రోజురోజుకు ముదురుతోంది. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘వరిసు’. ‘దిల్’ రాజు, శిరీష్, పరమ్ వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కానీ సంక్రాంతి సీజన్‌లోనే రవిశంకర్ నిర్మిస్తున్న నవీన్ ఎర్నేని, వై.చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘ఏజెంట్’ సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు తమిళంలో అజిత్ నటించిన ‘తునీవు’ కూడా సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల థియేటర్ల లెక్కలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా రామ్ తో వారియర్ సినిమా చేసిన తమిళ దర్శకుడు లింగుస్వామి చేసిన ప్రకటన సంచలనంగా మారింది.

తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో వరిసుకు థియేటర్లు దొరక్కపోతే తెలుగు సినిమా ఎన్నో విధాలుగా నష్టపోవాల్సి వస్తుందని లింగుస్వామి హెచ్చరించారు. తమిళ సినిమాల ఆదాయంలో సగటున 20 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో లింగుస్వామి వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమయ్యింది. తమిళ దర్శకులకు మనవాళ్లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతుండగా.. మళ్లీ తెలుగు వారికి వార్నింగ్ ఇచ్చే స్థాయికి వచ్చారంటూ లింగు స్వామిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
మరోవైపు సంక్రాంతి, దసరా పండుగల సందర్భంగా తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆపై అనువాద చిత్రాలకు థియేటర్లు కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నోట్‌ను విడుదల చేసింది.

ఈ విషయంపై కొందరు తమిళ దర్శక-నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు ఇచ్చే పరిస్థితి లేకుంటే తమిళంలో కూడా తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించకూడదని తమిళంలో చర్చలు జరుగుతున్నాయన్న చర్చ మొదలుపెట్టారు. మరోవైపు సంక్రాంతి, దసరా సీజన్లలో డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపడం కుదరదని ‘తోడేలు’ కార్యక్రమంలో అల్లు అరవింద్ అన్నారు. డబ్బింగ్ సినిమాల విడుదలను ఆపాలని మేం ఎక్కడా చెప్పలేదు. సంక్రాంతి, దసరా సీజన్లలో తెలుగు సినిమాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఎగ్జిబిటర్లను కోరుతూ లేఖ రాశామని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు.

