News AlertTelangana

కమలం పార్టీలో చేరిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్పంచ్‌లు

Share with

నల్లొండ జిల్లాలో వలసలు మొదలయ్యాయి. చండూర్‌ మండలంలోని పలు గ్రామాల టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సర్పంచ్‌లు బీజేపీ పార్టీలో చేరారు. హూజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ సమక్షంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాషాయం కండువా కప్పుకున్నారు. చొప్పరివారి గూడెం, ధోనిపాముల, నెర్మట, తుమ్మలపల్లికి చెందిన టీఆర్‌ఎస్ సర్పంచ్‌లు బీజేపీ పార్టీలో చేరారు. ఉడతల పల్లి, కోటయ్య గూడెం, శిర్దే పల్లి, గొల్లగూడెంకు చెందిన కాంగ్రెస్‌ సర్పంచులు  కూడా కమలం పార్టీలో చేరారు. మునుగోడు మండలం చల్మడ టీఆర్‌ఎస్‌ గ్రామ సర్పంచ్‌, కస్తాల, కొండాపురంకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీలు ఈటెల రాజేందర్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.