ఆ కండక్టర్ కు ఆఫర్..
తన ఎత్తు కారణంగా విధుల్లో ఇబ్బందులకు గురువుతున్నారని ఆర్టీసీ బస్ కండక్టర్ గా పని చేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడికి ఎక్స్ వేదికగా ఓ ఆఫర్ ఇచ్చారు. సీఎం రేవంత్ సూచనల మేరకు అహ్మద్ కు ఆర్టీసీలో సరైన ఉద్యోగం ఇవ్వాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా ట్యాగ్ చేసి ఆదేశించారు. అయితే.. 7 అడుగుల ఎత్తు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారీ మెహదీపట్నం డిపోలో ఆర్టీసీ బస్ కండక్టర్ గా పని చేస్తున్నారు. బస్సులు 6.4 అడుగుల ఎత్తే ఉండటంతో ఉద్యోగం చేయడంలో ఇబ్బంది ఏర్పడిందని ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.


 
							 
							