Home Page SliderTelangana

అమిత్ షా@ ఆదిలాబాద్

Share with

తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఈ మేరకు తెలంగాణాలో నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అమలు లోక్ వచ్చింది. దీని ప్రకారం నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా తెలంగాణాలో ఎన్నికల ప్రచార ఢంకా మోగించేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్ చేరుకున్నారు. కాగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో ఈ రోజు జనగర్జన సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సభకు చేరుకున్న అమిత్ షాకు బీజేపీ పార్టీ నేతలు తరుణ్ చుగ్,కిషన్ రెడ్డి,బండి సంజయ్  స్వాగతం పలికారు. అయితే మరికాసేపట్లో జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. కాగా తెలంగాణా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారి అమిత్ షా రాష్ట్రానికి వచ్చారు.