నితీష్ రెడ్డి అరుదైన రికార్డు
తెలుగు యువ క్రికెటర్ నితీష్ రెడ్డి .. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియా తో జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ మూడో రోజున తన తొలి టెస్ట్ సెంచురీని సాధించిన సంగతి తెలిసిందే. యాషెస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫి సాధించాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా తడబడుతూ ఆడుతుంది.టాప్ ఆర్డర్ ,మిడిలార్డర్ అంతా కుప్పకూలినా నితీష్ మాత్రం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో సెంచురీ చేశాడు. ఆస్ట్రేలియా పై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రంలో అదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు తొలి టెస్ట్ సెంచురీని బాదిన టాప్ 3 క్రికెటర్లలో నితీష్ చోటు సంపాదించాడు. సచిన్ టెండుల్కర్ 18 ఏళ్ల 253 రోజులకే ఈ ఘనతను సాధించి ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుండగా ఆ తర్వాత స్థానాల్లో రిషబ్ పంత్ 21 ఏళ్ల 91 రోజులు,ఇప్పుడు నితీష్ రెడ్డి 21 ఏళ్ల 214 రోజులకే ఈ ఘనతను సాధించినవారి జాబితాలో నిలిచాడు.

