జనవరి 27 నుంచి నారా లోకేశ్ పాదయాత్ర
జనవరి 27, 2023 నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర నిర్వహించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు లోకేశ్ పాదయాత్ర చేస్తారు. ఏడాది పాటు ప్రజల్లో వారి కష్టాలను తెలుసుకుంటారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ.. వారి నుంచి అభిప్రాయాలు సేకరించి.. వారి కోసమే పనిచేయాలని లోకేశ్ భావిస్తున్నారు. పాదయాత్రలో పలు చోట్ల లోకేశ్ బహిరంగ సభల్లోనూ పాల్గొంటారు. ఏపీలో ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక మంది సీనియర్ రాజకీయ నేతలు పాదయాత్రలు చేసి.. అధికారంలోకి వచ్చారు. వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. సుదీర్ఘ పాదయాత్రల ద్వారా ఓ వైపు పార్టీ బలోపతం కావడంతోపాటు.. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం ఉంది.