పవన్ ఢిల్లీ పర్యటనపై నాగబాబు ట్వీట్
తన రాజ్యసభ సీటు పై వస్తున్న వార్తలపై జనసేన నేత నాగబాబు ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. “అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడు దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతాడు. ఢిల్లీ వెళ్లింది మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ ను ఇవ్వడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా నాయకుడికి సేవ చేయడం తప్ప నాకు వేరే రాజకీయ ఆశయం లేదు” అని నాగబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


 
							 
							