NewsTelangana

నా కొడుకును కొట్టించారు-మల్లారెడ్డి ఆవేదన

తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులపై విమర్శలు గుప్పించారు. తాను జీవితంలో ఎంతో కష్టపడి పైకి వచ్చానన్నారు. 12 ఏళ్ల క్రితమే ఆస్పత్రి కట్టామన్నారు. ఉన్నతంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. మాకు సంబంధం లేని వ్యక్తుల గురించి ప్రశ్నిస్తున్నారన్నారు. తన కుమారుడిపై సీఆర్పీఎఫ్ జవాన్లతో కొట్టించి, దౌర్జన్యం చేశారన్నారు. ఒకవేళ అక్రమాలుంటే ఆస్తులను వేలం వేసుకోవచ్చు గానీ… తన బిడ్డపై ఇలా దౌర్జన్యం చేయడమేంటన్నారు. వేల మందికి సేవ చేస్తే తప్పా అని ఆక్రోశం వెళ్లగక్కారు. తన కుటుంబ సభ్యులకు చెందిన 50 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారన్నారు. కనీసం నా బిడ్డను చూడనివ్వలేదంటూ ఆయన ఆవేకన వ్యక్తం చేశారు. దాడులు జరిపినప్పుడు డబ్బులు దొరుకుతాయని.. వాళ్ల పని వాళ్లు చేసుకోనివ్వండన్నారు. అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుందన్నారు. పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి లావాదేవీలున్నప్పుడు డబ్బులు తప్పనిసరిగా ఉంటాయన్నారు. కావాలంటే బ్యాంక్ ఎకౌంట్లు చెక్ చేసుకోవచ్చననారు. టీఆర్ఎస్ మంత్రిని కాబట్టి దాడి చేశారన్నారు.