కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదన్న కేంద్రం
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో గత వారం రోజులుగా నిత్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలను వింటూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల వల్లే వాటర్ పంపులు మినిగిపోయాయని విమర్శలు వెల్లువెత్తాయ్. ప్రాజక్టు అనాలోచితంగా నిర్మించడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్న అభిప్రాయం నెలకొంది. ఇలాంటి తరుణంలో… కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో జాతీయ హోదా ఇచ్చేది లేదని కేంద్రం కుండబద్ధలు కొట్టింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అర్హతలు అసలే లేవంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టుబడుల అనుమతులూ లేవని తేల్చి చెప్పింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.