NationalNews

ఎమ్మెల్యేల బాటలో శివసేన ఎంపీలు.. గేమ్ ఓవర్

Share with

ఎమ్మెల్యేలు మాత్రమే కాదు యువరానర్.. పది మంది ఎంపీలు కూడా శివసేన రెబల్ నేత ఎక్‌నాథ్ షిండేను బలపరుస్తున్నారు. ఉద్ధవ్ కు వ్యతిరేక కూటమిలో చేరేందుకు వారందరూ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఉద్ధవ్ థాక్రేను వదిలేసి… ఎక్‌నాథ్ గ్రూపులో చేరేందుకు మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గుచూపగా… తాజాగా అదే దారిలో ఎంపీలు పయనిస్తున్నారు. ఎక్‌నాథ్ శిబిరంలో 37 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. శివసేన.. ఆయన సొంతం కానుంది. రాజన్ విచారే- థానే ఎంపీ, భవ్నా గావ్లీ- వాషిమ్, కృపాల్ తుమానే- రామ్‌టెక్, శ్రీకాంత్ షిండే-కళ్యాణ్, రాజేంద్ర గవిత్ షిండే-పాల్ఘర్ తోపాటు పలువురు ఎంపీలు ఎక్‌నాథ్ షిండేకు మద్దతుగా నిలిచారు. రాజన్ విచారే, శ్రీకాంత్ షిండే ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలో ఉన్నారు. శివసేనకు అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యేలుండగా… తనకు 40 మంది మద్దతుందని ఎక్‌నాథ్ చెబుతున్నారు. శివసేనకు 19 లోక్ సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు. ఐతే శివసేన కుటుంబం ఎప్పటికీ చీలిపోదని… పార్టీని శివసైనికులు బతికుంచుకుంటారంటూ ట్వీట్ చేశారు పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రియాంక చతుర్వేది.