కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ
తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. నిర్వాసితుల సమస్యలు, వారికి పరిహారం, భూసేకరణ మొదలగు అంశాలపై అనేక పిటిషన్లు దాఖలు అయ్యాయి. కాళేశ్వరం టీఆర్‌ఎస్‌కు డబ్బు సంపాదించిపెట్టే మార్గమని, నిధులు ప్రభుత్వ పెద్దల చేతుల్లో చేరుతున్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు పైన పటారం లోన లొటారం అనీ పెద్దపెట్టున విమర్శలు రేగాయి. ఈప్రాజెక్టు వ్యయంపై ఆరోపణలు వెల్లువెత్తాయ్. వాటిలో 6 పిటిషన్లు ఈనెల 22న విచారణకు స్వీకరించారు. విచారణ ఇవాళ జరిగింది. కోర్టు భూసేకరణపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈవిషయంలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని, పిటిషనర్లు కూడా రిజాయిండర్ దాఖలు చేయాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈకేసులో ఆగస్టు 23న తుది విచారణ జరుగుతుందని కోర్టు వెల్లడించింది.
Read more: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నారన్న బండి