సీపిఐకి ఎమ్మెల్సీ ఖరారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది.మొత్తం నాలుగు సీట్లకు గాను ఒక సీటును సీపిఐకి కేటాయించనున్నారు.తెలంగాణలో గత సాధారణ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఒప్పందంలో భాగంగా సీపిఐ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోబోతుంది.మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపిఐ నాయకత్వం చేసిన త్యాగానికి ఈ కేటాయింపు చేయనుంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించింది.దీంతో ఆదివారం సీపిఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ రేసులో ఉండగా సీటు త్యాగం చేసిన పలువురు అభ్యర్ధులు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్నారు.ఇదిలా ఉండగా సామాజిక సమీకరణ కూర్పుపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది.ఇందులోనే రెండు పదవులను ఎస్సీ,ఎస్టీలతో భర్తీ చేయనున్నారు.

