9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో చెరువులో దూకి 9 నెలల చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వంట విషయంలో సుజాతకు భర్త వెంకటేశ్వర్లుతో గొడవ జరిగింది. దీంతో సుజాత ఆత్మహత్య చేసుకుంది. చెరువులో దూకినట్లు సమాచారం అందుకున్న పోలీసులు తల్లి, బిడ్డ మృతదేహాలు బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు చేస్తున్నారు.

