దోమలను పట్టితే బహుమతి
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ప్రాంతంలో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దోమలను సజీవంగా లేదా చంపి తెచ్చినా రివార్డు ఇస్తామని ఆ గ్రామ పెద్దలు ప్రకటించారు. దోమల బాధ తట్టుకోలేక గ్రామంలో డెంగ్యూపై స్థానికులు దండయాత్ర ప్రకటించారు. మనీలా సమీపంలోని క్యూజోన్ నగరంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో దోమలను పట్టిస్తే బహుమతి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు ఫిలిప్పీన్స్ లో దాదాపు 28,234 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది.