ఫుట్‌పాత్‌పై లారీ బీభత్సం..10 మంది మృతి
హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పైకి అమిత వేగంతో దూసుకెళ్లింది. అక్కడ 50మంది దాకా కూరగాయల వ్యాపారులు ఉండడంతో బీకర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 10 మంది మృతి చెందారు. కొందరి మృతదేహాలు ఛిద్రమై గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

