Andhra Pradesh

వివేక హత్యపై ప్రమాణం చేస్తారా?

వైసీపీ సర్కారుపై సూటి విమర్శలు చేస్తున్న నారా లోకేశ్… తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో తనకు, తన కుటుంబానికి సంబంధం లేదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. 14-04-2021న వివేకా హత్యతో సంబంధం లేదని కలియుగ ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానన్న లోకేశ్… బాబాయ్ హత్యతో, మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్ రెడ్డి అంటూ ట్వీట్ చేశారు. తిరుమల వెళ్తున్న మీరు ప్రమాణం చేస్తారా లేక బాబాయ్ గొడ్డలిపోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు.