‘ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల తరహాలో కొట్టుకుంటున్నారు’.. విజయ్
తమిళగ వెట్రికళగం(టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ స్టార్ హీరో విజయ్ తమ పార్టీ ప్రణాళికలపై మీడియాతో చర్చించారు. చెంగల్పట్టు జిల్లా పూంజేరి గ్రామంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో పార్టీ రెండవ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే శాసనసభ ఎన్నికలలో టీవీకే పార్టీ పోటీ చేస్తోందని, తప్పకుండా అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ హిందీ భాష విషయంలో ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల తరహాలో కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలైన ప్రజా సమస్యల నుండి దృష్టి ప్రజల దృష్టి మరల్చేందుకో బీజేపీ, డీఎంకేలు పరస్పర విమర్శలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. భాషను బలవంతంగా సమాజంపై రుద్దడం సమాఖ్య విధానానికి విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమానికి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వచ్చే ఎన్నికలలో తాను టీవీకే పార్టీని గెలిపిస్తానని హామీ ఇచ్చారు.

