కేజ్రీవాల్‌ని నిన్నొదల బొమ్మాళి అంటున్న లిక్కర్ స్కాం
ఢిల్లీ లిక్కర్ స్కాం ..ఆప్ అధినేత అరవింద్ ని నిన్నొదల బొమ్మాళి అనే విధంగా వెంటాడుతోంది.ఇటీవలే బెయిల్ పై విడుదలై ఊపరిపీల్చుకుంటున్న అరవింద్ కేజ్రీవాల్‌ని మళ్లీ విచారించేందుకు అనుమతి కావాలంటే ఈడి వేసిన పిటీషన్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.విచారణకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటికే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష కూడా గడిపాడు.త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బయటకొచ్చి సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఈడి చేసిన అభ్యర్ధనపై లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతించడం ఉత్కంఠరేపుతోంది.ఇటీవల ఢిల్లీలో ఆప్ మళ్లీ పొలిటికల్ యాక్టివేషన్‌ను ముమ్మరం చేయడంతో ఈడి కూడా కేసుల విషయంలో దూకుడు పెంచినట్లు కనిపిస్తుంది.

