Home Page SliderTelangana

సమాజ సేవలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు

మునుగోడు మండలం కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన మూడు అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. నూతనంగా నిర్మించిన తరగతి గదుల భవనంతో పాటు, మరో మూడు తరగతి గదులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు శంకుస్థాపన చేశారు. పాఠశాల తరగతి గదుల భవన ప్రారంభోత్సవం సందర్భంగా కొంపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు గ్రామస్తులు, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.

ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ పాఠశాలకు వచ్చి చూస్తే తరగతి గదులు కూలే స్థితిలో ఉన్నాయని, ఆ రోజుల్లో రెండు కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించాలనే ఆలోచన వచ్చిందన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. కానీ ప్రభుత్వ అనుమతులు రావని స్థానికులు చెప్పారని… అందుకే పాఠశాలలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ విడుదలవారీగా పరిష్కరించాలని నిర్ణయించుకున్నానన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కోరారు. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు. పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత తనదన్న ఎమ్మెల్యే విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత తీసుకోవాలని అధ్యాపకులను కోరారు.

ఇక్కడ విద్యార్థులు బాగుపడాలని ఆలోచన చేసి మా అత్తమ్మ పేరు మీద 30 లక్షలు వ్యయం చేసి భవనాలను నిర్మించామన్నారు కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి. ముందు ముందు ఇలాంటి సహాయాన్ని ప్రతి పాఠశాలకు ఎసేలా శక్తి ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులు చదువుకొని విద్యావంతులై వాళ్ల పేరు నిలబెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులకు తోడ్పాటు గా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కొంపెల్లి సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ నారబోయిన రవి ముదిరాజ్, డిసిసిబి డైరెక్టర్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్వాయి చెన్నారెడ్డి, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.