నన్ను చంపాలని ప్లాన్ చేస్తున్నారు…
డేట్ రాసి పెట్టుకోండి… నన్ను వందకు 100 శాతం చంపేస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, ముస్లిం మతంలోకి మారుస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. ధర్మం కోసం ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడితే.. వారి గొంతులు, తలలు నరుకుతున్నారన్నారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనని కూడా ఏదో ఒకరోజు మట్టుబెడతారన్నారు. అయితే… తాను మరణించే ముందు తనదొక కల ఉందని.. అందరూ తనలాగే తయారవ్వాలని, ఇదే తన సంకల్పమని రాజాసింగ్ తెలిపారు. అందరూ ధర్మ రక్షణకు పాటుపడాలని, లేకపోతే హిందువులంతా ముస్లిం మతంలోకి మారే పరిస్థితి ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.