యూట్యూబ్ ప్రచారం నిజం కాదు
ఆంధ్ర, తెలంగాణలో కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్న సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. సుంకర ప్రసాద్ నాయుడు సహా 13 మందిని అరెస్టు చేసారు గుంతకల్లు పోలీసులు. ఓ ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటియాస్ , ఓ బుల్లెట్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 6.50 లక్షల నగదు రికవరీ చేశారు. గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్ ను డబ్బు కోసం ఈ నెల 20 న కిడ్నాప్ చేసిన నిందితులు డోన్ సమీపంలోని ఓబుళాపురం మిట్టపై దాచి కోటి రూపాయిలు డబ్బు తీసుకురావాలని… లేదంటే చంపుతామని బాధిత కుటుంబ సభ్యులకు బెదిరించారు. డోన్ సమీపంలోని ఓబుళాపురం మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టు చేశారు. నిందితుల చెర నుంచి బాధితునికి విముక్తి కలిగించారు. గత నెల 29 న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసారు. రెండు దశాబ్దాలకు పైగా నేరాలకు పాల్పడుతున్న సుంకర ప్రసాద్ నాయుడునిందితుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో 11 కేసులన్నాయ్యాయని వివరాలు వెల్లడించారు ఎస్పీ పకీరప్ప
యూట్యూబ్ లో చూపిస్తున్నాట్టు సుంకర ప్రసాద్ నాయుడు పై 33 హత్య కేసులు, 50 కిడ్నప్ కేసులు లేవన్నారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ప్రసాద్ పై… మొత్తం 20 కేసులు ఉన్నాయన్నారు. కేవలం రెండు హత్య కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు. రాజస్థాన్ కు చెందిన పప్పు అనే వ్యక్తి నుంచి 9 ఎం ఎం పిస్తోలు మూడు నెలల కింద కొనుగోలు చేశారన్నారు. అనంతపురం లో ఈ ముఠా పై రెండు కేసులు నమోదయ్యాయని చెప్పారు. అసత్యమైన వివరాలతో సుంకర ప్రసాద్ నాయుడు కు సంబంధించి యూట్యూబ్ లో వీడియో లు అప్ లోడ్ చేసిన వారు వాటిని తొలగించాలని హెచ్చరించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీలుకుంటామని స్పష్టం చేశారు.