NewsTelangana

తెలంగాణపై మోదీ, షా దృష్టి… అందుకే… హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలు

Share with

బీజేపీ అంటేనే ఉత్తరాది పార్టీ అన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ బీజేపీకి అన్ని రాష్ట్రాలపైనా ఒకటే భావన ఉంటుంది. దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. కర్నాటకలో ఆ మేరకు పార్టీ విజయం సాధించింది. కర్నాటక తర్వాత బీజేపీ బలపడటానికి స్కోప్ ఉన్న ప్రాంతం తెలంగాణానేనని… గత కొంత కాలంగా పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ఈసారి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ జెండా ఎగురేయాలని పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. కేసీఆర్ రెండేళ్ల టర్మ్‌లో ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. తెలంగాణకు రోడ్ మ్యాప్ నిర్దేశించడంతోపాటు, హస్తినలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. అందులో భాగంగా… వచ్చే రోజుల్లో పార్టీ అనుసరించాల్సి వ్యూహాలను ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేనిపైనైనా గురిపెడితే మిస్సయిన దాఖలు లేవు… ఈసారి తెలంగాణపై నేరుగా మోదీయే కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కష్టపడి పనిచేస్తే అధికారం ఖాయమని… ఇప్పటికే పార్టీ నేతలకు ప్రధాని మోదీ, అమిత్ షా ఉద్భోదించారు కూడా… అగ్రనేతల రెండు రోజుల పర్యటనలతో పార్టీలో మరింత ఊపు వస్తోందన్న అభిప్రాయం ఉంది. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు సైతం వివరించినట్టు తెలుస్తోంది.