టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మృతి కేసులో కీలక మలుపు
టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ అనుమానాస్పద మరణంపై దర్యాప్తు వేగవంతమైంది. సతీశ్ ఫోన్‌లోని డేటా కేసులో కీలక ఆధారంగా మారింది. ఘటన సమయంలో ఫోన్ ధ్వంసమైనందున, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారని పోలీసులు తెలిపారు.
పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరైన సతీశ్, 13న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ వ్యవధిలో ఆయన ఎవరితో మాట్లాడారు? ఎలాంటి కమ్యూనికేషన్ జరిగింది? తెలుసుకునేందుకు ఫోన్‌లోని మెసేజ్‌లు, వాట్సాప్ కాల్స్, ఇంటర్నెట్ కాల్స్, పూర్తి డేటాను అధికారులు విశ్లేషిస్తున్నారు.
దర్యాప్తులో ఈ ఫోన్ డేటా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

