NewsTelangana

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై సీబీఐ విచారణకు కేఏ పాల్ డిమాండ్

Share with

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్… సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌ను కలిసిన పాల్… కేసీఆర్ కుటుంబ సభ్యులు… 9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి తెలంగాణలో ఉందన్నారు కేఏ పాల్. రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారని… ఆస్తులపై విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తుల లెక్క బయటపడుతుందున్నారు.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే… ప్రస్తుతం నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసారని విమర్శించారు కేఏ పాల్. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆస్తులు కూడబెట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి జరిగిందన్నారు. ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మొత్తం ఒక్క కాళేశ్వరం నుంచే 75 వేల కోట్లు దోచుకున్నారన్నారు.

యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగిందన్నారు కేఏ పాల్. 2 వేల కోట్లలో 200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలని సీబీఐ డైరెక్టర్‌ను పాల్ కోరారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా సీబీఐ విచారణ జరపాలన్నారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తానన్నారు. సీబీఐతోపాటు… కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు ఫిర్యాదు కాపీలను పంపించామన్నారు.