NewsTelangana

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Share with

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయ్. జూన్ నెల 18 నుంచి 21 మధ్య రాష్ట్రమంతటా ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. 30,31న ఫార్మా, అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు జరిగాయ్. ఈసెట్ ఫలితాల్లో 90.69 శాతం ఉత్తీర్ణత పొందారు. పరీక్షరాసిన 22 వేల ఒక్కరిలో 19,953 మంది పాసయ్యారు. ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఎంసెట్ లో ఫస్ట్ ర్యాంక్ పోలు లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డికి లభించగా… సెకండ్ ర్యాంక్ నక్కా సాయి దీప్తిక, మూడో ర్యాంక్ పొలిశెట్టి కార్తికేయకు లభించాయి. అగ్రికల్చర్ విభాగంలో జూటూరి నేహ మొదటి ర్యాంకు పొందగా… రెండో ర్యాంకు వంటాకు రోహిత్, కల్లం తరుణ్ కుమార్ రెడ్డి‌కి దక్కాయి.