రాజీనామా సిద్ధమన్న ఉద్ధవ్ థాక్రే…
శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే మొత్తం పరిణామాలపై నోరు విప్పారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఉద్ధవ్ థాక్రే. శివ సేన ఎమ్మెల్లేల్లో ఒక్కరైనా సరే నన్ను రాజీనామా చేయమని కోరితే తక్షణమే రాజీనామా చేస్తానన్నారు. నన్ను ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావాల్సిందిగా శరద్ పవార్, కమల్ నాథ్ స్పష్టంగా కోరారన్నారు థాక్రే. హిందుత్వమే శివసేన నినాదం.. సిద్ధాంతమని తేల్చి చెప్పారాయన. నేను సమర్థుడను కానని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా… సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు. రాజీనామాను సిద్ధంగా ఉంచుకున్నానని… ఎమ్మెల్యేలు కోరితే తక్షణం రాజీనామా చేస్తానన్నారు థాక్రే.