NationalNews Alert

కరోనాకు చుక్కల మందు త్వరలో రెడీ

Share with

దేశంలో కరోనా సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కొంత కాలం తగ్గుముఖం పట్టిన ఈ వైరస్ మళ్లీ రకరకాల వెరియంట్‌లు గా రూపు దాల్చుతూ ఇంకా తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యాధిని నియంత్రించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ  కొవిడ్‌ వ్యాధికి చుక్కల మందు టీకాను తయారుచేస్తున్నట్టు , దానిని ప్రజల్లోకి తీసుకురావడానికి భారత ఔషధ నియంత్రణ మండలికి దరఖాస్తు చేసినట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. అన్నీ అనుకూలిస్తే తాము చేసిన దారఖాస్తుకు ఈ నెలలోనే గ్రీన్ సిగ్నల్ రావచ్చన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ టీకాతో పాటు చుక్కల మందు కూడా తోడైతే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.

ఈ టీకాను ఇప్పటికే 4,000 మంది వాలంటీర్లపై పరీక్షించి చూడగా , ఎవరికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదన్నారు కృష్ణ. కొవిడ్ కేసులు పెరిగిన , వైరస్ లో కొత్తగా ఎన్ని వెరియంట్‌లు వచ్చిన చుక్కల మందు ద్వారా ఎదుర్కోవచ్చన్నారు. డెల్టా , ఒమిక్రాన్ , బీఏ4, బీఏ4 ల కన్న తాజాగా వెలుగులో ఉన్న బీఏ5 చాలా భిన్నమైందని , ప్రజలు ఈ వెరియంట్ విషయంలో చాలా అప్రవత్తంగా ఉండాలని సూచించారు. తాము కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ పరిశోధనలు కొనసాగిస్తున్నమన్నారు.