Andhra PradeshNewsNews Alert

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల

Share with

ఏపీ 2022 పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పదో తరగతి పరీక్షలో దాదాపు 2,01,627ల మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించలేదు. ఈ ఏడాది జులై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. . సప్లిమెంటరీ పరీక్షలను బాలురు 1,09,413, బాలికలు 82,433 మంది రాయగా… బాలురు 60 శాతానికి పైగా, బాలికలు 68 శాతం పాస్‌ అయ్యారని విద్యా శాఖ మంత్రి తెలిపారు. 1,91,896 మంది పరీక్ష రాస్తే 1,31,233 మంది పాస్ అయ్యారని… మొత్తంగా 64.23 శాతం ఉత్తీర్ణత సాధించారని.. 87.52 శాతం విద్యార్థులు పాస్‌ కావడంతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో… పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 46.66 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. 2022-ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించలని నిర్ణయం తీసుకొంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తుంటారు.అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్‌ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్‌ పాస్‌’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ధ్రువపత్రాలు జారీ చేస్తారు