చైనాలో లేవి వైరస్ కలకలం
ఇప్పటికే చైనాలో పుట్టిన కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తలకిందులయ్యాయి. అది సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఎంతో మందిని బలి తీసుకోవడంలో పాటుగా , దేశ ఆర్ధిక వ్యవస్ధను పాతాళానికి చేర్చింది కరోనా. తాజాగా మరో కొత్త వైరస్ చైనాలో కలకలం రేపుతోంది. చైనాలోని షాంగ్ డాంగ్ , హెనాన్ ప్రావిన్స్ లో లాంగ్యా హెనిపా వైరస్ అనే కొత్త వ్యాధి విస్తరిస్తోనట్టు , ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలకు ఈ వ్యాధి సోకినట్టు చైనా మీడియా ప్రకటించింది. ఈ వైరస్‌ను లేవిగా కూడా పిలుస్తున్నట్టు సమాచారమిచ్చిన మీడియా వర్గాలు , ఈ కేసులు ఎక్కువగా చైనా తూర్పు ప్రాంతలలో బయటపడుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఈ వైరస్ సంబంధిత కేసులు 35 పైగా నమోదవ్వగా , 26 మంది జ్వరం , తలనొప్పి , దగ్గు , వాంతులతో ఇబ్బంది పడుతున్నట్టు చైనా మీడియా వివరించింది.
జంతువుల నుంచి ఈ వైరస్ ప్రధానంగా మనుషులకు విస్తరిస్తున్నట్టు గ్లోబల్ టైమ్ మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి లక్షణాలు కూడా కరోనా వ్యాధికి దగ్గరగా ఉన్నట్టు సమాచారం. కానీ దీనికి ఎటువంటి మందు గానీ , వ్యాక్సీన్ గానీ ఇంకా అందుబాటులోనికి రాలేదన్న వైద్యులు తెలిపారు. అయితే ఇది అంత ప్రమాదకరమైన వైరస్ కాదనీ , ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని చైనా నిపుణులు చెబుతున్నారు.