Andhra PradeshHome Page Slider

జగన్ ఎన్నికల ప్రచార షెడ్యుల్ విడుదల, ఏప్రిల్ 19న ఎన్నికలు?

ఫిబ్రవరి 16 కుప్పం నియోజకవర్గంలో, సీఎం జగన్… వైయస్సార్ చేయూత చివరి దశ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం, మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ బీసీ నేస్తం మూడోదశ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27 గుంటూరు విద్యా దీవెన నాలుగవ త్రైమాసికం విడుదల మొత్తాన్ని విడుదల చేస్తారు. మార్చి 5 – సత్యసాయి జిల్లా వసతి దీవెన రెండో దశ నిధులు విడుదల కార్యక్రమం జరుగుతుంది.

మార్చి 6న చివరి కేబినెట్ సమావేశమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మార్చి 7 నుంచి ఏప్రిల్ 14 వరకు 40 రోజుల పాటు 120 నియోజకవర్గాలు, 21 పార్లమెంటు సెగ్మెంట్లలో రోజు మూడు సమావేశాలు నిర్వహిస్తారు. ఏపీలో ఏప్రిల్ 19న పోలింగ్ జరిగే అవకాశముందని వైసీపీ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణలో ఏప్రిల్ 16న పోలింగ్ జరిగే అవకాశం ఉందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. .