పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ISI, హమాస్!
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ISI, హమాస్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గం తెలిపింది. బంగ్లాదేశ్ లోనూ తమ నెట్ వర్క్ ను ISI విస్తరిస్తున్నాయి. సంచలన విషయాలను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కొన్ని రోజుల క్రితమే POK లో హమాస్ కీలక నేతలు కనిపించారు. అప్పుడే భారీ ర్యాలీలు నిర్వహించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ పై దాడి చేసిన తీరులోనే కాశ్మీర్ పై దాడికి పాల్పడింది. ఉగ్రవాదులు PoK లో ట్రైన్ అయినట్టు తెలుస్తోంది. హమాస్ ట్రైనింగ్ షెడ్యూల్ ను LeT, JeT ఉగ్ర సంస్థలు ఫాలో అవుతున్నట్టు సమాచారం. ఈ రెండు ఉగ్ర సంస్థలకు పాక్ ISI మద్దతు పలుకుతుందని ఇంటెలిజెన్స్ ఏజెల్సీలు గుర్తించాయి. దాడి జరిపిన వారిలో కొందరు పాక్, కొందరు స్థానికులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. PoK లో కొన్ని రోజుల క్రితమే కీలక నేతలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమావేశంలో హమాస్, LeT, JeT నేతలు పాల్గొన్నారు.