కమలాహారిస్ టెలిప్రాంప్టర్ వాడుతున్నారా?…
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రచార సభలలో టెలిప్రాంప్టర్ వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబరులో అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. కమల తన ఎన్నికల ప్రచార సభలో 32 రోజులు అనే పదాన్ని అనేకమార్లు ఉచ్ఛరించారు. సభలో టెలిప్రాంప్టర్ వాడారని, అది ఆగిపోవడం వల్ల తర్వాతేం మాట్లాడాలో తెలియక అదే పదాన్ని అనేకమార్లు చెప్పారని మీడియాలో కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వీడియో చాలా వైరల్‌గా మారింది. ఇది అబద్దమని, ఆమె అలాంటివేం వాడడం లేదని అది హోస్ట్ కోసమని ఫ్యాక్ట్ చెక్ తెలియజేసింది.