NewsNews AlertTelangana

హైదరాబాద్‌లో ఫేక్ సర్టిఫికేట్ ముఠా గుట్టురట్టు

Share with

ఈ మధ్య హైదరాబాద్‌లో  నకిలీ దందాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో నకిలీ డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో KPHBకి చెందిన వెంకటేశ్వరరావు కంప్లైట్‌తో ఈ ఫేక్ సర్టిఫికేట్ ముఠా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు SOT మాదాపూర్,KPHB పోలీసులు కలిసి నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌లను తయారు చేస్తున్న ఈ  ముఠాను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ ముఠాను గురించి మీడియాతో మాట్లాడారు.

ఈ గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడుగా ఉన్న కోట కిషోర్ కుమార్‌తో పాటు 10 మందిని అరెస్టు చేశాం అన్నారు.ఈ కేటుగాళ్ళు ఇన్నాళ్ళు పోలీసుల కళ్ళు గప్పి..10th,ఇంటర్,డిగ్రీ,పీజీ సర్టిఫికేట్స్,TCలు  ఫేక్‌వి సింగిల్ సిట్టింగ్‌లో ఇస్తున్నారన్నారు.అంతేకాకుండా దాదాపు 18 రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్శిటీస్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నారని తెలిపారు. వీళ్ళు డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్స్‌ను రూ.50,000/- ,బి.టెక్ సర్టిఫికెట్స్‌ను రూ.1,50,000/- నుంచి రూ.2,00,000/-లక్షలకు విక్రయిస్తున్నట్లు  తెలిపారు.ఈ ముఠా నుంచి ఇప్పటి వరకు 100 మందికి పైగా ఫేక్ సర్టిఫికెట్లు పొందారన్నారు.అయితే వీరిలో కొందరు ఈ ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు కూడా పొందినట్లు తెలిసిందన్నారు.ఈ క్రమంలో నిందితుల నుంచి 70 ఫేక్ సర్టిఫికెట్స్,4 ఫేక్ స్టాంప్స్,CPUలు,బ్యాంక్ కార్డ్స్,ఆధార్ కార్డ్స్,డ్రైవింగ్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్నామని సీపీ స్టీపెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు.