అన్‌స్టాపబుల్ షోలో..పవర్‌స్టార్
బాలయ్య హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న షో అన్‌స్టాపబుల్. తెలుగు రాష్ట్రాలలో మంచి స్పందన అందుకున్న ఈ షో సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ షోలో నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఈ షోకు ప్రధానంగా సినీ,రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. దీంతో అభిమానులు ఈ షోను వీక్షించడానికి విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. కాగా అన్‌స్టాపబుల్ షో తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఈ షోకు గెస్ట్‌గా వచ్చారు. హోస్ట్ బాలకృష్ణ, చంద్రబాబుకు వియ్యంకుడు కావడం విశేషం. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబును ఆసక్తి రేకెత్తించే ప్రశ్నలు అడిగారు. వీటికి చంద్రబాబు కూడా ఎంతో సరదాగా సమాధానమిచ్చారు. ఈ ఎపిసోడ్‌ను మిలియన్లలో ప్రేక్షకులు వీక్షించారు. దీంతో ఈ షో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అయితే ఈ షోకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ గెస్ట్‌గా రానున్నారని ప్రస్తుతం టాక్ నడుస్తోంది. ఈ అన్‌స్టాపబుల్ షోకి ఆయన తన ప్రాణమిత్రుడు దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి రానున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాలలో ఈ షో మరింత ప్రాధాన్యం సంతరించుకొని టీఆర్పీ రికార్డ్‌లను బ్రేక్ చేస్తుందనే చెప్పాలి. మరి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఈ షోకు ఎప్పుడు రానున్నారో వేచి చూడాల్సివుంది.

