వైఎస్ షర్మిల కీలక నిర్ణయం… పాలేరు నుండి పోటీలోకి…
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎట్టకేలకు తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పాలేరు అసెంబ్లీ బరి నుండి తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పాలేరుతో పాటు మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానని, తన భర్త, తల్లి విజయమ్మలను కూడా పోటీ చేయించాలని పార్టీ శ్రేణులు పట్టు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అంతే కాక రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలలో తమ పార్టీ పోటీకి రాబోతోందని బీఫార్మ్స్ కోసం దరకాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు, లేదా విలీనం కోసం పాట్లు పడిన షర్మిల, అది కుదరక పోవడంతో ఇక విడిగా, ఒంటరిగానైనా పోటీలో దిగాలని డిసైడ్ అయ్యారు షర్మిల. ఓట్లు చీల్చడానికే అంటూ మండిపడుతున్నారు ఇతర పార్టీ నాయకులు.