Andhra PradeshHome Page Slider

ఎమ్మెల్యే కారు.. ఎక్కడున్నారు సారు? దుర్గగుడి వద్ద విచిత్రం చూడండి

Share with

దసరా నవరాత్రులలో దుర్గమ్మ ప్రత్యేక అవతారాలలో దర్శనమివ్వడంతో భక్తులు లక్షలాదిగా తరలివచ్చి, క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షించి అమ్మను దర్శించుకుంటారు. కానీ ఈ చిత్రం చూడండి.. దేవాదాయ శాఖ మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమమెల్యే వెలంపల్లి శ్రీనివాస్ కారు దుర్గగుడి పైకి వస్తుంటే ఎవరు ఆపుతారు? అందరూ వదిలేశారు. కొండపై ఓం మలుపు దగ్గర డీసీపీ విశాల్‌ గున్నీ పరిశీలిస్తుండడంతో.. పోలీసు అధికారి వెళ్లి ఎమ్మెల్యే కారు చూడగా సారు లేరు. అనుచరులో.. సిఫార్సుపై వచ్చిన వారో కనిపించారు. దీంతో వారిని అక్కడే కారు దిగి పైకి నడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పడంతో ఇదిగో ఇలా దిగి నడిచి వెళ్లారు. ముఖ్యులకు ఇచ్చేకారు పాసు ఉన్న వాహనాల్లో అయినా పంపితే బాగుంటుంది కానీ.. ఇలా ఏకంగా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నకారులోనే అనుచరులను పంపడంతో ఎవరూ ఆపలేకపోతున్నారు. దేవాదాయశాఖ మాజీ మంత్రి ఎమ్మెల్యేనే ఇలాచేస్తే ఎలాగని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు.