InternationalNews

వారం రోజుల్లో శ్రీలంకకు కొత్త అధ్యక్షుడు…

Share with

తీవ్ర అర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు గొటబయ రాజపక్స సింగపూర్ నుంచి తన రాజీనామా లేఖను ఈమెయిల్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ మహింద అభయవర్ధకు పంపించారు. గొటబయ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వారం రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు. అప్పటి వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రంసింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారన్నారు. కొత్త అధ్యక్షడిని ఎన్నుకోనేందుకు శనివారం పార్లమెంట్ సమావేశం అవుతుందన్నారు. ఎంపీలంతా పార్లమెంట్‌ హాజరయ్యేలా శాంతియుత వాతావరణం కల్పించాలని ఆందోళకారులను స్పీకర్ కోరారు.