గొటబయ పారిపోవడానికి సాయం చేయలేదన్న భారత్
గొటబయ పారిపోవడానికి భారత ప్రభుత్వం సహయం చేసిందని అక్కడి మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై శ్రీలంకలోని భారత ఎంబసీ స్పందించింది.
ఆ ఆరోపణల్లో నిజం లేదు. లంక ప్రజలకు పూర్తి మద్దతిస్తున్న ఇండియా… ప్రజల పక్షాన నిలుస్తామని స్పష్టం చేసింది. లంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతోన్న వేళ అధ్యక్షుడు గొటబయ రాజపక్ష నివాసాన్ని నిరసనకారులు ముట్టడించే సమయానికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఆయన ఆచూకీ తెలియలేదు. దేశం నుంచి మిలిటరీ జెట్‌లో భార్య, రక్షణ సిబ్బందితో మాల్దీవులు రాజధాని మాలెకు చేరుకున్నారు. ఐతే ప్రస్తుతం ఆయన మాలె నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ రగులుతున్న శ్రీలంక
శ్రీలంకలో పరిస్ధితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి పారిపోవడంపై ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేలాదిగా జనం ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వచ్చారు.కొలంబోలో పరిస్ధితి మరింత ఉద్రిక్తంగా మారడంతో ఆందోళకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
దీంతో నిరసకారులు పోలీసులపై తిరగబడ్డారు. వారిని కట్టడిచేసేందుకు పోలిసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
Read More: మాల్దీవులకు శ్రీలంక అధ్యక్షుడు