NewsTelangana

నాన్నకు ప్రేమతో కేటీఆర్… హ్యాట్రిక్ పక్కా…

Share with

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేదని.. ఎన్నికలు 2023లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు సీఎం కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. రీసెంట్‌గా వచ్చిన రెండు సర్వేల్లో టీఆర్ఎస్ గెలుస్తోందని రిపోర్ట్స్ వచ్చాయన్నారు కేటీఆర్. అటు బీజేపీ చీప్, ఇటు కాంగ్రెస్ అధ్యక్షులు ప్రెస్‌మీట్ పెట్టి టీఆర్ఎస్ గెలుస్తోందని చెప్పడం సంతోషాన్నిస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పక్కా గెలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండు పార్టీలు కూడా… వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాయన్నారు కేటీఆర్. పాలేరులో మా ప్రత్యర్థి షర్మిల, ఇంకో చోట బండి కావచ్చు ఇంకో చోట రేవంత్ కావొచ్చు అది పెద్ద సమస్య కాదన్నారు. పీకే నుండి రెగ్యులర్ ఫీడ్ బ్యాక్ వస్తోందని చెప్పుకొచ్చారు. రిపోర్ట్ ఆధారంగా పార్టీలో సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు.

కేసీఆర్ ముడోసారి సీఎం కావడం తథ్యమన్నారు. దక్షిణ భారతదేశంలో మూడు సార్లు వరుస ముఖ్యమంత్రి అయిన లీడర్ లేరని… త్వరలో అది సుసాధ్యం కాబోతుందన్నారు. మా పార్టీలో ఉన్న విభేదాలే పార్టీ బలానికి నిదర్శనమన్నారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, తుమ్మల కలిశానని వివరించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా బలం, బలహీనతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. పార్టీలను చీలుస్తాం… ప్రభుత్వాలను కూలుస్తామనడం ఆ పార్టీ అనైతికతకు నిదర్శనమన్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే మేరకు… ఎవరికి వారు ఏది పడితే అది ఊహించడం సరికాదన్నారు. పార్లమెంట్‌లోనూ అన్ పార్లమెంట్ భాష వాడుతూ ఇతరులకు బీజేపీ నేతలు నీతులు చెప్తోందంటూ దుయ్యబట్టారు. మోదీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో బలం లేకపోయినా ప్రభుత్వాలను కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ చీప్ బండి సంజయ్ చరిత్ర తెలుసుకుంటే మంచిదన్నారు కేటీఆర్.