వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని..
వచ్చే ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వం సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ ఓడి పోయారో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను అనుసరిస్తూ..ఈ సారి ఎన్నికలకు ముందుగానే రంగంలోకి దిగారు. అదే విధంగా ఎక్కువ సమయం ప్రజలతో గడుపుతూ, ప్రతి మీటింగ్‌లో తానే స్వయంగా ప్రజలతో చర్చించి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ పోటి చేసిన మూడు నియోజక వర్గాల్లో ఒక్క రాజోలు తప్ప మిగిలిన భీమవరం , గాజువాక సహా అన్ని నియోజక వర్గాలలో ఓటమి పాలయ్యారు. ఈ సారి అలా జరగకుండా జాగ్రత్త పడుతూ, తాను ఓడిన భీమవరంలోనే పవన్ మీటింగ్ నిర్వహించనున్నారని జనసేన అధ్యక్షుల్లో ఒకరైన గోవిందరావు స్వయంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన జూలై 17న జనసేన జనవాణి కార్యక్రమం భీమవరంలో జరగనుండగా దానికి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ఆనంద ఫంక్షన్‌హాల్ లో జరగనుండగా, దీని కోసం జనసేన శ్రేణులు ఏర్పట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10గం.ల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరగనుండగా ప్రజల నుండి అర్జీలను స్వయంగా పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు. అర్జీతో పాటు ప్రజలు వారి సమస్యల గురించి వివరించవచ్చు అని గోవిందరావు అన్నారు.