థాయ్‌లాండ్‌కు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ…
శ్రీలంక తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు గోటబయ కారణమంటూ లంక ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో జూలై 13న గోటబయ దేశం విడిచి మాల్దీవులకు …అక్కడి నుంచి సింగపూర్‌కు వెళ్లిన సంగతి తేలిసిందే.గోటబయ 14 రోజుల పర్యాటక వీసాపై సింగపూర్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందారు.ఇప్పుడు ఆ వీసా గడువు ఆగస్టు 11తో ముగియనుండడంతో తనకు ఆశ్రయమివ్వమంటూ గోటబయ థాయ్‌లాండ్ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై థాయ్‌లాండ్ ప్రధాని ప్రయుత్ చాన్-ఓ-చా మాట్లాడుతూ.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సను తాత్కాలికంగా దేశంలో ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
గోటబయను దేశం లోపలికి అనుమతించడం మానవతావాద దృక్పథంతో తాత్కాలిక వుండేందుకు మాత్రమేనని, అయితే ఇక్కడ ఉన్నప్పుడు గోటబయా ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు నిర్వహించకూడదని అన్నారు. థాయ్‌లాండ్ లో ఉంటూనే అతడు శాశ్వతంగా ఆశ్రయం పొందేందుకు వేరే దేశాలను వెతికేందుకు ఉపయోగపడుతుందని థాయ్ ప్రధాని చాన్-ఓ-చా చెప్పినట్లు బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక వెల్లడించింది. గోటబయా దౌత్యపరమైన పాస్‌పోర్ట్ హోల్డర్‌గా ఉన్నందున 90రోజుల పాటు థాయ్‌లాండ్‌లో ఉండవచ్చని థాయ్‌లాండ్ విదేశాంగ మంత్రి డాన్ ప్రముద్వినై చెప్పారని థాయ్‌లాండ్ లోని మీడియా పేర్కొంది.