ట్రిపుల్ ఐటీలో కలుషితాహారం-ప్రభుత్వ వైఫల్యమేనన్న ఈటెల
ఈరోజు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్దులకు ఆహారంలో కల్తీ జరిగింది. అనారోగ్యానికి గురైన విద్యార్దులకు చికిత్స జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు.విద్యార్దులు చాలా రోజులుగా భోజనం బాగా లేదంటూ నిరసనలు చేసిన తర్వాత కూడా కల్తీ జరుగుతోంది అంటే ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో తెలుస్తోందని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో, రెసిడెన్షియల్స్ లో చాలాసార్లు ఆహారం కలుషితమౌతోందని, పేద విద్యార్దులకు నాణ్యమైన ఆహారం అందించఢంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పేదవిద్యార్దులంటే చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read More: అర్వింద్ కాన్వాయ్ దాడిపై స్పందించిన అమిత్ షా