NewsTelangana

కాంట్రాక్టర్‌లు మారలేదు..ప్రభుత్వ వైఫల్యమే కారణం

Share with

బాసర ట్రిపుల్ ఐటీ కలుషిత ఆహార సంఘటనలో 100కి పైగా అస్వస్ధతకు గురికాగా.. 29 మంది తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండగా వైద్యం కొరకు వారిని  నిజామాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  ఓ విడియోను విడుదల చేశారు. IIT లో  ఇంతకు ముందే ఆహార పదార్ధాల విషయమై నెలకొన్న ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి  చర్యలు చేపట్టని కారణంగానే ఈ సమస్య ఎదురైందన్నారు.విశ్వవిద్యాలయంలోని సమస్యల పరిష్కారం కొరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంతకమునుపు రూ .5 కోట్లు ఇచ్చినా, పాత కాంట్రాక్టర్‌లు మారని కారణంగా విద్యార్దుల భోజనంలో ఎటువంటి మార్పు రాలేదని, ఈ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని వీడియోలో పేర్కొన్నారు. మెస్‌ను యాజమాన్యం నిర్వహిస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేస్తూ దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు.

Read More: పల్లె గోస – బీజేపీ భరోసా