Telangana

తెలంగాణాకు మరోసారి వరుణుడి రాక..వాతావరణశాఖ అలర్ట్

Share with

తెలంగాణాలో ఇప్పుడిప్పుడే ప్రజలకు సూర్యుడి దర్శనం కలుగుతుంది. భారీవర్షాల నుంచి ప్రజలు నెమ్మదిగా తేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు పిడుగు లాంటి వార్తను తెలిపింది. అదేంటంటే ఈ నెల 18 నుండి తెలంగాణాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని తెలిపింది. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాలు గురువారం నుంచి తగ్గు ముఖం పట్టినప్పటికీ తెలంగాణాలోని అనేక జిల్లాలను వరద ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో శుక్రవారం మధ్యహ్నం నాటికి గోదావరి నీటిమట్టం దాదాపు 70 అడుగులకు చేరడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Read More: అర్వింద్ కాన్వాయ్ దాడిపై స్పందించిన అమిత్ షా