బీజేపీ అధికారంలోకొస్తేనే… తెలంగాణ రైతుల కష్టాలు తీరతాయన్న ఈటల
ఇవాళ ఎన్నికలు ఉన్నయని రైతులను మోసం చేసేందుకు కేసీఆర్ కొత్త మాటలు చెబుతున్నడన్నారు తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అంటూ మాట్లాడుతున్న కేసీఆర్ నాలుగున్నర సంవత్సరాలుగా.. రైతులకు ఇచ్చిన భరోసాను పూర్తిచేయలేదన్నారు. రైతాంగానికి గతంలో అనేక సబ్సిడీలు వచ్చేవన్న ఈటల, ఇవాళ అవన్నీ ఎత్తేసి.. ఒక్క రైతు బంధు ఇస్తూ.. మిగిలిన అన్నీ దోచేస్తున్నడన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తరుగులేకుండా ధాన్యం కొంటామన్నారు. రైతుల హక్కుగా అందాల్సిన అన్ని సబ్సిడీలు అందిస్తామన్నారు. మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రాగానే పేదలకు ఇండ్లకోసం జాగాలిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే.. కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారందరూ ముక్తకంఠంతో కేసీఆర్ ను పంపించి.. మోదీ గారికి పట్టం గడితేనే మా జీవితాలు బాగుపడతాయంటున్నారన్నారు ఈటల.


